నర్సాపూర్/శివ్వంపేట, మే 13: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు ఖాయమైందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలో జిల్లాలో ముమ్మర ప్రచారం చేశామని, వెంకట్రామిరెడ్డి సేవలకు ఆకర్షితులై ప్రజల నుంచి స్పందన వచ్చిందన్నారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు అనుకూలంగా ఉందని, వెంకట్రామిరెడ్డికి పట్టం కడుతున్నారన్నారు. మెదక్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలు పు కోసం నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడ్డారని. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్కు ఓటేసిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. ఆమె వెంట జిల్లా గ్రం థాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, యువ నాయకుడు సంతోష్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, నాయకులు సత్యంగౌడ్, బాల్‌రెడ్డి, జగదీశ్, సూరారం నర్సింహులు ఉన్నారు.