శివ్వంపేట, అక్టోబర్ 2: మంత్రిగా ఉన్న కొండా సురేఖ తన స్థాయిని మరిచి దిగజారి మాట్లాడటం సరికాదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆమె నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఏ పార్టీ వారైనా ఒక మహిళను ట్రోల్ చేయడం సమాజానికి మంచిది కాదన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యక్తిగత దూషణలతో మాజీమంత్రి కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మహిళలు అని చూడకుండా మాపై కామెంట్ చేసినప్పుడు ఆ రోజు మీకు కనిపించలేదా..? వినపడలేదా అని ప్రశ్నించారు. తనదాకా వస్తేగానీ మీకు తెల్వదా అని సూటి గా ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌కు మంత్రి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హన్మంత్‌రెడ్డి, రాం రెడ్డి, సత్తిరెడ్డి, లక్ష్మణ్, భిక్షపతిరెడ్డి, నర్సింహారెడ్డి, రా మకృష్ణారెడ్డి, ముత్యంరెడ్డి, రాకేశ్‌రెడ్డి, నర్సారెడ్డి పాల్గొన్నారు.