నర్సాపూర్, జనవరి 6: రైతులకు రూ.15 వేల రైతుభరో సా ఇస్తామని చెప్పి, కేవలం రూ.12 వేలు మాత్రమే ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర రైతాంగాన్ని నయవంచన చేశారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం నర్సాపూర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కాం గ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసినందుకు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా చేసి ఆరు గ్యారెంటీలకు, రైతు డిక్లరేషన్‌కు శవయాత్ర చేపట్టా రు. క్యాంప్ కార్యాలయం నుంచి నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వరకు ఆరు గ్యారెంటీల ఫ్లెక్సీలను, రైతు డిక్లరేషన్‌కు శవయాత్ర నిర్వహించి నర్సాపూర్ చౌరస్తాలో సమా ధి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వమ ని, ఆరు గ్యారెంటీలు, 420 హామీలను విస్మరించిందని ఎద్దేవా చేశారు. ప్రశ్నించే గొంతుకలైన కేటీఆర్, హరీశ్రావులపైన అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీమంత్రి కేటీఆర్‌ను లాయర్తోసహా ఈడీ కార్యాలయంలోకి రానివ్వకుండా అడ్డుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను, రైతులను నిలువునా మోసం చేసిం దని మండిపడ్డారు.
ఎన్నికల ముందు ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పి, నేడు ఖజానా ఖాళీ అని చెప్పడం సిగ్గుచేటన్నారు. భూమిలేని వారికి రూ.12 వేలు ఇస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి, ఉపాధి హామీ కూలీలకూ వర్తింపచేయాలని డి మాండ్ చేశారు. ఆటోకార్మికులకు ఇస్తానన్న రూ.15వేలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అమలుకాని హామీలు ఇచ్చి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం కచ్చితంగా రైతుభరోసా రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని, రైతుల పక్షాన నిలబడుతుందని హామీనిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, లేబర్ వెల్ఫేర్ బోర్డ్ మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, బీఆర్ఎస్కేవీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సత్యంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, మాజీ ఎంపీపీ హరికృష్ణ, శివంపేట్ మండల అధ్యక్షుడు రమణా గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రా గౌడ్, బీఆర్ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డి, షేక్ హుస్సేన్, శివకుమార్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.