కొల్చారం, జూలై 10 : బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుందని, అర్హులకు పథకాలు, సంక్షేమ ఫలాలు అందించేందకు తాము కృషిచేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి అన్నారు. కొల్చారంలో గురువారం 12 మంది లబ్ధిదారులకు 9.30 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వర్తించని కుటుంబాలు ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందడానికి సీఎం సహాయనిధి బాసటగా నిలుస్తుందన్నారు.
అనంతరం రంగంపేటలో మాధవానంద సరస్వతి ఆశ్రమాన్ని ఆమె దర్శించుకున్నారు. దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నా రు. కార్యక్రమంలో మాజీ జట్పీటీసి ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్, ఎంపీపీ మం జూల కాశీనాథ్, నాయకులు నరేందర్ రెడ్డి, తునుకుల పల్లి సంత్ష్ రావు, రవితేజ రెడ్డి, దొడ్ల ఆంజనేయులు, వినోద్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
గురుపూర్ణిమ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు గురువారం రంగంపేట శివారులో ని మాధవానంద సరస్వతి ఆశ్రమాన్ని దర్శించుకుని స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.