బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక
ఆషాడ మాసంలో గ్రామగ్రామాన జరిగే బోనాల పండుగలు మన సంస్కృతికి ప్రతీకలు అని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డిలోని ఫల పరిశోధన స్థానం ఆవరణలోని శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయంలో శాలివాహనులు భక్తిశ్రద్ధలతో బోనాలు తీశారు.
- ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్
సంగారెడ్డి, జూలై 19: ఆషాడ మాసంలో గ్రామగ్రామాన జరిగే బోనాల పండుగలు మన సంస్కృతికి ప్రతీకలు అని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డిలోని ఫల పరిశోధన స్థానం ఆవరణలోని శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయంలో శాలివాహనులు భక్తిశ్రద్ధలతో బోనాలు తీశారు. అంతకుముందు పట్టణంలోని ప్రభుత్వ అతిథిగృహం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు శాలివాహనులు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్తబల్లోని అమ్మవారికి సమర్పించారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలను సన్మానించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల విందులో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులోని ఎల్లమ్మ ఆలయంలో గౌడసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, నాయకులు విజయేందర్‌రెడ్డి, చింత సాయినాథ్, శ్రీధర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ రామప్ప, ఆంజాద్, వాజిద్‌తో పా టు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

