నర్సాపూర్, నవంబర్ 3: రోగులకు మెరుగైన సేవలు అందించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వైద్యులకు సూచించారు. ఆదివారం నర్సాపూర్‌లోని ఏరియా దవాఖానాను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రో గులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులనుతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
సోమవారం ప్రారంభించనున్న కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దవాఖానకు వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని సూచించారు. రోగులకు మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ నాయకులు సత్యంగౌడ్, ప్రసాద్, శ్రీకాంత్, వీరేందర్, సలీం, సద్దాం, వైద్య సిబ్బంది ఉన్నారు.