నర్సాపూర్ : రాష్ట్రంలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రజలకు సూచించారు. వివిధ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, చెరువులు, మత్తల్లు దుంకుతున్నాయి. ఎవరు కూడా వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ స్కూళ్లలో కానీ సంఘ భవనాల్లో కానీ పునరావాసం పొందాలని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే అధికారులను సంప్రదించి వారి సూచనలను, సహాయ సహకారాలను పొందాలన్నారు. ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలిగే చోట బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి వారికి సహాయ సహకారాలు అందజేయాలని సూచించారు.