MLA Sunitha Lakshma reddy | శివ్వంపేట, డిసెంబర్ 4 : శివ్వంపేట మండలం గూడురు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ గురుపీఠంలో గురువారం దత్త జయంతి వేడుకలు విశేష భక్తిశ్రద్ధలతో శ్రీ గురు పీఠం చైర్మన్ శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలి వచ్చి పూజలు చేశారు.
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి దీవెనలు అందుకున్నారు. అనంతరం ఆలయంలోని సాయిబాబా మందిరంలో పూజలు చేసి గ్రామ ప్రజల అభ్యున్నతికై ప్రార్థనలు చేసి హారతి తీసుకున్నారు. దత్తాత్రేయ మహాస్వామి విశిష్టతను యువతలో పెంపొందించాలనే లక్ష్యంతో విద్యార్థులను ఆలయ దర్శనానికి ప్రత్యేకంగా తీసుకువచ్చి భక్తి భావం, ఆధ్యాత్మిక విలువల ప్రాముఖ్యతను వివరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మరిన్ని సదుపాయాల విస్తరణ కోసం శ్రీ గురు పీఠం నిర్వహణ కమిటీ కృషి చేస్తుందని చైర్మన్ శివకుమార్ గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణ గౌడ్, మాజీ సర్పంచ్ స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్ గౌడ్, శ్రీ గురు పీఠం ట్రస్ట్ సభ్యులు, మండల నాయకులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Rayapole Mandal | రాయపోల్ మండలంలో రెండు జీపీలు ఏకగ్రీవం.. పల్లెల్లో వేడెక్కిన రాజకీయం
Dasyam Vinay Bhaskar | కేసీఆరే పాలనే తెలంగాణకు రక్షణ : దాస్యం వినయ్ భాస్కర్
La Nina: ఈ శీతాకాలంలో లానినా ప్రభావం 55 శాతం మాత్రమే !