చేర్యాల, సెప్టెంబర్ 25: నియోజకవర్గంలో ప్రజలు, బీఆర్ఎస్ నా యకులపై రోజురోజుకూ దాడులు, అక్రమ కేసులు పెరుగుతున్నాయ ని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇటీవల వినాయక నవరాత్రుల ముగింపు రోజు బీఆర్ఎస్ యువజన నాయకులు అవుశెర్ల కిశోర్, అవుశెర్ల వెంకటేశ్‌పై కాంగ్రెస్ నాయకులు దాడిచేయడంతో వారు తీవ్రం గా గాయపడగా బుధవారం వారిని పరామర్శించారు. అనంతరం చేర్యాల ఎస్సై నీరేశ్ తో ఫోన్లో మాట్లాడారు.
బీఆర్ఎస్ యువజన నాయకులపై దాడికి దిగిన వారిపై కేసు నమోదు చేయకుండా క్షతగాత్రులు, దాడికి గురైన వారిపై కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు బాధితులకు న్యాయం చేయకపోయినా అన్యాయం చేయవద్దని సూచించారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలతో పాటు నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్‌ను గమనిస్తున్నామని, ప్రతి విషయాన్ని రికార్డు చేస్తున్నామని, దీనిపై త్వరలో పోలీస్ ఉన్నతాధికారులతోపాటు డీజీపీని కలిసి నివేదిక అందజేస్తానన్నారు.
అనంతరం చేర్యాలలో కొనసాగుతున్న ప్రీమియర్ లీగ్ క్రికెట్లో ఎమ్మెల్యే క్రికెట్ ఆడారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, టౌన్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, మాజీ ఎం పీపీ మేడిశెట్టి శ్రీధర్, ముస్త్యాల బాల్నర్స య్య, అంకుగారి శ్రీధర్‌రెడ్డి, పెడుతల ఎల్లారెడ్డి, శివగారి అంజయ్య, జింకల పర్వతా లు, వడ్లకొండ శ్రీనివాస్, అరిగే కనకయ్య, సూటిపల్లి బుచ్చిరెడ్డి, తిరుపతిగౌడ్ ఉన్నారు.