ఈ నెల 23న మెదక్‌లో జరుగునున్న సీఎం కేసీఆర్ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మెదక్ జిల్లా ఇన్చార్జి రాధాకృష్ణ శర్మ, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రామాయంపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం పార్టీ కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా చివరికి విజయం బీఆర్ఎస్, కేసీఆర్‌దే అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. కాంగ్రెస్‌ను కనుమరుగు చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.రామాయంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 200 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
-రామాయంపేట, ఆగస్టు 20
రామాయంపేట, ఆగస్టు 20: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కనుమరుగు చేయాలనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని, ఈ నెల 23న మెదక్‌లో జరిగే సీఎం సభకు వేలాదిగా కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మెదక్ జిల్లా ఇన్చార్జి రాధాకృష్ణ శర్మ, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, సమన్వయ కర్తలు రవీందర్‌రెడ్డి, శ్రీహరి యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం రామాయంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి బైక్ ర్యాలీ చేపట్టి సభాస్థలికి చేరుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే, ఇన్చార్జి సమక్షంలో రామాయంపేట పట్టణంతో పాటు మండలంలోని ఆర్.వెంకటాపూర్, సుతారిపల్లి, శివాయిపల్లి, కాట్రియాల, దంతెపల్లి, కిషన్ తండా తదితర గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీల నుంచి సుమారు 200 వరకు బీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా ఇన్చార్జి రాధాకృష్ణ మాట్లాడుతూ 23న జరిగే సీఎం సభకు వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలన్నారు. మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పైచేయిగా ఉందన్నారు. ఎక్కడ చూసినా పద్మాదేవేందర్‌రెడ్డి పేరు మార్మోగుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పద్మాదేవేందర్‌రెడ్డి కృషి చేస్తున్నదన్నారు. ఆమె ఓ వీర వనితలా, పార్టీకి వెన్నముఖలా పని చేస్తూ నియోజకవర్గంలో పేరు ప్రతిష్ఠలు పొందారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కక్షలు కట్టినా చివరికి గెలుపు బీఆర్ఎస్దే ఉంటుందన్నారు.
అధినేత ఆకాంక్షలను నెరవేరుస్తా : మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్ నియోజకవర్గంలో మహిళల కష్టాలను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని, సీఎం ఆకాంక్షలను తాను నెరవేరుస్తానని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. విపక్షాలు మాట్లాడుతున్న మాటలకు తలొగ్గేది లేదని, ఎన్ని కుట్రలు పన్నినా చివరికి విజయం బీఆర్ఎస్దే అన్నారు. విపక్షాలు మాటలకే తప్ప వారికి చేతలు రావన్నారు. ఎక్కడో ఏ దేశంలో ఉండి మాట్లాడితే తెలంగాణ ప్రాంత ప్రజలు ఊరుకోరని, కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గుణపాఠం చెబుతారన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు బండారి మహేందర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీల చైర్మన్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.