మెదక్ : కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ కోసం తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మంగళవారం ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..బాపూజీ త్యాగాలు భవిష్యత్ తరాలకు తెలియాలి. విలువలకు కట్టుబడిన వ్యక్తిగా జీవితాంతం అదే విలువలతో బతికారని ఆయన సేవలను కొనియాడారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమనేత కేసీఆర్ కు కొండా లక్ష్మణ్ అండగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్ జగపతి,మున్సిపల్ వైస్ చైర్మన్ అరెళ్ల మల్లికార్జున్ గౌడ్, కౌన్సిల్ సభ్యులు తదితరులున్నారు.