గణనాథులకు పూజలు
మెదక్ పట్టణం నర్సిఖేడ్‌లో జరిగిన వినాయక నిమజ్జనంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పాటలు పాడారు.
- జిల్లాలో కనులపండువగా నిమజ్జనం
- ఊరూరా వినాయకుల శోభాయాత్ర
- ఎమ్మెల్యే పద్మాదవేందర్రెడ్డి ప్రత్యేక పూజలు
- నిమజ్జనానికి తరలుతున్న గణనాథులు
మెదక్ అర్బన్/ మెదక్ రూరల్/ చిన్నశంకరంపేట/ రామాయంపేట/ చేగుంట/ కొల్చారం, సెప్టెంబర్ 27 : మెదక్ పట్టణం నర్సిఖేడ్‌లో జరిగిన వినాయక నిమజ్జనంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పాటలు పాడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద కుటుంబ సమేతంగా మెదక్ పట్టణంలోని పంచముఖి గణేశ్ మండపం వద్ద వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ మండలంలో బుధవారం ఆయా గ్రామాల్లో ్జగణపయ్యలను ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కొంటూరు చెరువులో వినాయకులను నిమజ్జనం నిర్వహించారు.

చిన్నశంకరంపేట మండలంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అంబాజిపేటలో కుంకుమార్చన చేశారు. రామాయంపేటలో వినాయక మండపాల వద్ద లడ్డూలను వేలం వేశారు. కేసీఆర్ కాలనీలోని వినాయకుల లడ్డూ లను కాలనీకి చెందిన దాసరి వెంకటి రూ.5వేలు, అనిల్‌కు మార్ రూ.3600 దక్కించుకున్నారు. కొల్చారం మండలంలో గణనాథుడి శోభాయాత్ర శోభాయమానంగా జరిగింది. ఎస్సై మహ్మద్‌గౌస్ బందోబస్తు చర్యలు తీసుకున్నారు.


Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

