బూర్గంపహాడ్, ఆగస్టు 08 : బూర్గంపహాడ్ మండలం సారపాక గోదావరి బ్రిడ్జి వద్ద శనివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. దీనికి సంబంధించి ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం… సారపాక-భద్రాచలం వంతెన కింద మూడో పిల్లర్ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో గజ ఈతగాడు ప్రసాద్ సహాయంతో మృతదేహాన్ని వెలికితీయించినట్లు తెలిపారు. మృతుడికి 40 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉంటుందని, బూడిద రంగు ఫుల్ హ్యాండ్స్ షర్టు, బ్లూ కలర్ జీన్స్ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహానికి సంబంధించిన ఆచూకీ, వివరాలు తెలిస్తే 8712682055, 8712682057 నంబర్లను సంప్రదించాలని కోరారు.