నిమ్స్‌లో లైంగికదాడి బాధితురాలికి బెదిరింపులు
ఖమ్మం జిల్లాలో లైంగికదాడికి గురైన బాలిక నిమ్స్ లో చికత్స పొందుతుండగా, నిందితుడి కుటుంబసభ్యులు బెదిరింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. జూన్ 6న లైంగికదాడికి గురై తీవ్రగాయాలతో బాధపడుతున్న బాలికను నిమ్స్‌లో చేర్పించగా, 3 నెలలుగా అక్కడే చికిత్స పొందుతున్నది.
- కోర్టులో సాక్ష్యం చెప్పొద్దంటూ బెదిరించిన నిందితుడి కుటుంబం
- ఠాణాలో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు
ఖైరతాబాద్, సెప్టెంబర్ 18: ఖమ్మం జిల్లాలో లైంగికదాడికి గురైన బాలిక నిమ్స్ లో చికత్స పొందుతుండగా, నిందితుడి కుటుంబసభ్యులు బెదిరింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. జూన్ 6న లైంగికదాడికి గురై తీవ్రగాయాలతో బాధపడుతున్న బాలికను నిమ్స్‌లో చేర్పించగా, 3 నెలలుగా అక్కడే చికిత్స పొందుతున్నది. ఈ ఘటనపై ఖమ్మం టూటౌన్ ఠాణాలో నిందితుడు మహ్మద్‌గౌస్(49)పై పోక్సోతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో ఈ నెల 16న బాలిక కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి ఉండగా, అనారోగ్య కారణాలతో హాజరుకాలేదు. ఈ నెల 16న సాయంత్రం ముగ్గురు గుర్తుతెలియని మహిళలు బాలిక ఉన్న వార్డుకొచ్చి మహ్మద్‌గౌస్‌కు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పొద్దని బెదిరించారు. బాలిక తల్లిదండ్రులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడింది గౌస్ కుమార్తెలు మహ్మ ద్ ఆస్మా, మహ్మద్ ఆఫ్రిన్తోపాటు అతని కోడలుగా గుర్తించి, కేసు నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- khammam
- Mohammad Ghouse
- NIMS
- TANA
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

