శామీర్పేట, సెప్టెంబర్ 18 : ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. శామీర్పేట డివిజన్ తూంకుంటలో నివాసం ఉండే ఆనంద్ వర్మ(42) తన తండ్రి ఆంజనేయులుతో కలిసి బొమ్మరాసిపేటలో మూడు చోట్ల పొలాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
సాగుతోపాటు ఇతరత్రా ఖర్చుల కోసం చేసిన అప్పులతో ఆర్థికంగా దెబ్బతిన్నాడు. సాగుకు భారీగానే పెట్టుబడి పెట్టాడు. వర్షాలు కురవకపోవడంతో దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉండటం, ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన కౌలు చేస్తున్న పొలంలోనే చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.