న్యాల్కల్/ ఝరాసంగం/ కోహీర్, నవంబర్ 27 : ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుండగా కాంగ్రెస్, బీజేపీ దరిదాపుల్లో లేవు. మాణిక్‌రావు ఇప్పటికే అన్ని గ్రామాల్లో ప్రచారం పూర్తి చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. నమూనా బ్యాలెట్‌తో ఓటర్లకు అవగాహన కల్పిస్తు న్నారు. కాంగ్రెస్, బీజేపీ హామీలను నమ్మొద్దని, ఎన్నికల్లో ఓటు తో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ తోనే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతున్నదని గులాబీ శ్రేణులు వివరిస్తున్నారు. ఈవీఎంలోని బ్యాలెట్లో మొదటి నెంబర్‌పై ఉన్న కారు గుర్తుకు ఓటేసి, మాణిక్‌రావును గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు కోరుతున్నారు.
న్యాల్కల్ మండలం కల్బేమల్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, సర్పంచ్ మహిపాల్ పిలుపునిచ్చారు. కల్బేమల్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్‌రావుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మరోసారి గెలిపిస్తుందన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యేగా మాణిక్‌రావును గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఝరాసంగం మండలకేంద్రలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాల యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎజాజ్బాబా మాట్లా డుతూ.. ఇంటింటికీ ప్రచారం చేస్తున్నామని, బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్‌రావు విజయం తథ్యమన్నారు. సమావేశం లో బీఆర్ఎస్ నాయకులు దశరథ్, ఎసయ్య, సామేల్, రుద్రయ్య స్వామి, బాల్‌రాజ్, జైపాల్, పెంటన్న పాల్గొన్నారు.
కోహీర్ మండలం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇంటింటి ప్రచారం చేస్తూ మాణిక్‌రావును గెలిపించాలని కోరా రు. ఈవీఎంలో 1వ నంబర్‌పై ఉన్న కారు గుర్తుకు ఓటేయాలని సూచించారు. ప్రచారంలో సర్పంచ్‌లు, కార్యకర్తలు ఉన్నారు.
ఝరాసంగం మండలకేంద్రంలో నిర్వంహిచిన రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభ విజయవంతమైంది. మంత్రి హరీశ్‌రావు సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీ గా తరలివచ్చారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలతో కదం తొక్కా రు. సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసింది. ఝరాసంగం మండ లకేంద్రంలో మంత్రి హరీశ్‌రావు రోడ్‌షో నిర్వహించారు. మంత్రి మాట్లాడుతున్నంత సేపు సభా ప్రాంగణం మొత్తం చప్ప ట్లు, నినాదాలు, ఈలలతో మార్మోగింది. సభ గ్రాండ్ సక్సెస్ కావడంపై జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావుతోపాటు ప్రజాప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.