మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని రైతువేదికలో మహిళలకు గృహలక్ష్మి మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని పథకాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో డబ్బులు కాజేసిన కాంగ్రెస్ నాయ కుల వల్ల లబ్ధిదారులకు మేలు జరగలేదన్నారు. అవినీతికి తావులేకుండా సంక్షేమ పథ కాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్‌కు మద్దతిచ్చి, మరోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారం లోకి తీసుకురావాలని కోరారు.
మనూరు, సెప్టెంబర్ 27: మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక లక్ష్యంతో ముందుకు సాగుతున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో గృహలక్ష్మి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని పథకాలు ప్రవేశ పెడుతూ రాష్ర్టానికి ప్రత్యే క గుర్తింపు తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట డబ్బులు కాజేశారన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు అందేలా గృహలక్ష్మిలో అవకతవకలకు తావులేదన్నారు. లబ్ధిదారులను గుర్తించి బహిరంగంగా మంజూరు పత్రాలు అందజేస్తున్నామన్నారు. ఒంటరి మహిళలకు పింఛన్, కల్యాణలక్ష్మి వంటి పథకాలు ప్రవేశపెడుతూ ఆదర్శంగా నిలించిందన్నారు. రైతుల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమంపై దృష్టి సారించి అనేక పథకాలు అమలుచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీ పీ కొంగరి జయశ్రీ మోహన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రాము లు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నాగప్ప పాటిల్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు విఠల్‌రావు, సర్పంచ్ శివాజీరావు పాటిల్, ఎంపీడీవో షాజీలొద్దీన్, నాయకులు నాగేందర్రావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నారాయణఖేడ్, సెప్టెంబర్ 27: అన్ని కులాలకు సముచిత గౌరవం కల్పిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం నారాయణఖేడ్‌లో రంగరాజ్ కుల సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణఖేడ్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న రంగరాజ్ కులస్తులకు గుర్తింపునిస్తూ వారి సంఘ భవనానికి ఐదు గుంటల స్థలం కేటాయించామన్నారు. దీంతోపాటు భవన నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో కుల సంఘాలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. నారాయణఖేడ్‌లో దాదాపు అన్ని కుల సం ఘాలకు ఆత్మ గౌరవ భవనాలు నిర్మించామన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎంఏ.నజీబ్, కౌన్సిలర్ వివేకానంద్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నగేశ్, నాయకులు రమేశ్చౌహాన్, అభిషేక్ శెట్కార్, పుటాల విఠల్, సంఘం బాధ్యులు ప్రకాశ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్/కల్హేర్, సెప్టెంబర్ 27: కల్హేర్ మం డలం కృష్ణాపూర్‌కు చెంది న బీజేపీ సీనియర్ నాయకుడు కుసంగి లక్ష్మయ్య ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో బుధవారం చేరారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీని బలపర్చి మరోసారి సీఎం కేసీఆర్‌కు పట్టం కటాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అలీ, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, రమేశ్ చౌహాన్ తదితరులు ఉన్నారు.