కారెక్కుతున్న కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆరు అబద్ధాలేనని, ఆ పార్టీ నాయకులు ఎన్ని గ్యారెంటీలు ప్రకటించినా తెలంగాణలో వారికి వారంటీలేదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం అందోల్‌లో వట్పల్లి, రాయికోడ్ మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
- అందోల్ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన వట్పల్లి, రాయికోడ్ మండలాల నాయకులు
- కాంగ్రెస్‌వి ఆరు గ్యారెంటీలు కావు.., ఆరు అబద్ధాలని విమర్శ
- బీఆర్ఎస్లో అన్ని వర్గాలకూ ప్రాధాన్యం
- ఎమ్మెల్యేను కలిసి మద్దతు తెలిపిన వివిధ సంఘాల నాయకులు
- బీఆర్ఎస్లో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
అందోల్/ వట్పల్లి, అక్టోబర్ 21: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆరు అబద్ధాలేనని, ఆ పార్టీ నాయకులు ఎన్ని గ్యారెంటీలు ప్రకటించినా తెలంగాణలో వారికి వారంటీలేదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం అందోల్‌లో వట్పల్లి, రాయికోడ్ మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నివర్గాలకు సీఎం కేసీఆర్ ప్రధాన్యతనిస్తున్నారన్నారు.
నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. అందోల్‌లో తన గెలుపు ఎప్పుడో డిసైడ్ అయ్యిందని, పార్టీ శ్రేణులు మెజార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా, వివిధ మండలాలకు చెందిన పలు సంఘాల నాయకులు ఎమ్మెల్యేను కలిసి మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా, పోతులబొగుడలోని ఎమ్మెల్యే నివాసంలో రాయికోడ్ మండలానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

