కోహీర్, అక్టోబర్ 9: హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కాంగ్రెస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పిలుపునిచ్చారు. గురువారం కోహీర్ పట్టణంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాలులో ఆయా గ్రామాల బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
బీఆర్ఎస్ తరపున పోటీచేసే 13 ఎంపీటీసీ స్థానాలతో పాటు, జడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం సైనికుల్లా పని చేయాలన్నారు. ఓట్ల కోసం గడపగడపకూ వెళ్లి ఓటర్లను అభ్యర్థించాలన్నారు. మండలాధ్యక్షుడు నర్సింహులు, సొసైటీ చైర్మన్ స్రవంతి రెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ రా మకృష్ణారెడ్డి, జడ్పీ మాజీ కో-అప్షన్ సభ్యుడు సయ్యద్ మోహీజొద్దీన్ పాల్గొన్నారు.