కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు లేక రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోలేక పోతున్నారని, పండిన వెంటనే తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థి తి నెలకొందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనిం టి మాణిక్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
- రైతులకు డ్రిప్ పరికరాలు అందించాలి
- రైతుల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు
జహీరాబాద్, మార్చి 25 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు లేక రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోలేక పోతున్నారని, పండిన వెంటనే తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థి తి నెలకొందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనిం టి మాణిక్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం అసెంబ్లీ బడ్జెట్ ప్రశ్నోత్తరాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్ నియోజకవర్గంలో ఎర్రమట్టి భూములు అధికంగా ఉండడంతో కోహీర్, జహీరాబాద్ మండలాల పరిధిలోని రైతులు అల్లం, పసు పు, అలుగడ్డ పంటలు ఎక్కువగా సాగుచేస్తారని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఆ పంటలను అమ్ముకునేందుకు హైదరాబాద్లోని బోయినిపల్లి, ఓల్డ్సీటీకి మార్కెట్లకు తరలించాల్సి వస్తున్నదని తెలిపారు.
ఆ పంటలు నిల్వచేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీ, గిడ్డంగులు స్థానికంగా లేకపోవడంతో సరైన ధర లభించక రైతుల ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచన చేయాలని కోరా రు. జహీరాబాద్ లేదా కోహీర్లో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో అధికంగా రైతులు చెరుకు తోటలు సాగుచేస్తారని, తక్కువ నీటితో అధిక దిగుబడులు రైతులకు డ్రిప్ పరికరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

