సిద్దిపేట, అక్టోబర్ 19: యాసంగి సాగుకు ఎలాం టి అంతరాయం లేకుండా రైతులకు నాణ్యమైన 24గంటల కరెంటు ఇవ్వాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. శనివారం సిద్దిపేట మారెట్ యా ర్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో ముచ్చటించారు. చుట్టుపకల మండలాల నుంచి తెచ్చిన వడ్లను కొనుగోలు చేయడం లేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అన్ని మండలాల నుం చి తెచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లు, పంట రుణమాఫీ, రైతు భరోసా కోసం రైతుల పక్షాన పోరాడుతామని అన్నదాతలకు భరోసా ఇచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగా నాణ్యమైన 24గంటల కరెంటు ఇవ్వాలన్నారు. సాయంత్రం ఐదు గంటలకు పోయి ఉద యం మూడు గంటల దాకా త్రీఫేస్ కరెంటు ఉం డడం లేదన్నారు. లోఓల్టేజీ సమస్యతో మోట ర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయన్నారు. కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి రైతుకు మద్దతు ధరను అందించాలని, పామాయిల్ రైతులకు రెం డో విడత మెయింటెనెన్స్ డబ్బులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని హరీశ్‌రావు కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మారెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.