సిద్దిపేట, మే 4: కేసీఆర్ బయటకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి ఎకరానికి రైతుభరోసా వేసిందని, రేవంత్ ప్రభుత్వంలో రైతులకు అనేక తిప్పలు పెడుతున్నారని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్‌లో జరుగుతున్న బీరప్ప ఆలయ ప్రథమ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ 10 రోజుల పాటు బీరప్ప ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
గొర్రెలకు డీడీలు కట్టిన ప్రతిఒకరికీ 100 శాతం గొర్రెల పంపిణీ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. కురుమ సంఘానికి భవనం కట్టుకున్నామన్నారు. గ్రామం చుట్టూ సీసీ రోడ్లు నిర్మించుకున్నామన్నారు. గుడికి స్పెషల్ డెవలప్మెంట్ నిధులు రూ.5 లక్షలు ఇచ్చామన్నారు. గొర్రెల షెడ్లు నిర్మించామన్నారు. బీరప్ప గుడికి రూ.లక్షతో మా నాన్న పేరిట రీలింగ్ వేసినట్లు తెలిపారు. బుస్సాపూర్ మీదుగా రింగ్ రోడ్డు వేశామని, గ్రామంలో అన్ని కుల సంఘాలకు భవనాలు నిర్మించామన్నారు. ఎల్లమ్మ గుడి వద్ద రూ.30 లక్షలతో ఫంక్షన్ హాల్ నిర్మించామన్నారు. తొర్నాల నుంచి బుస్సాపూర్, బుస్సాపూర్ నుంచి ఘనపూర్‌కు డబుల్ రోడ్డు, బుస్సాపూర్ నుంచి గుడి కందుల, వరదరాజుపల్లికి గల్లీగల్లీలో సీసీ రోడ్లు నిర్మించుకుమన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు తిప్పలు పడుతున్నారని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. వడ్లు, మకలు కొనకపోవడంతో 22 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మండి పడ్డారు.. బుస్సాపూర్‌కు లిఫ్ట్ మంజూరు చేశాం 90శాతం పనులు తాను మంత్రిగా ఉన్న సమయంలోనే పూర్తి చేసుకున్నామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక తట్టేడు మట్టి ఎత్తలేదన్నారు. పనులు పూర్తి చేసుకొని లిఫ్ట్‌తో పొలాలకు నీళ్లిచ్చేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల ఆధ్యక్షుడు ఎర్ర యాదయ్య, మాజీ ఎంపీపీ శ్రీదేవి చందర్రావు సర్పంచ్ ఐలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.