రామచంద్రాపురం, జనవరి 24: రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని వెలిమెల, ఈదులనాగులపల్లి, కొల్లూర్, ఉస్మాన్‌నగర్, తెల్లాపూర్లలోని వివిధ వార్డుల్లో రూ. 23కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేకం గా రూ. 25కోట్లు మంజూరు చే శారని తెలిపారు. సీఎం కేసీఆర్ మంజూరు చేసిన ప్రత్యేక నిధుల తో మున్సిపాలిటీలోని అన్ని వా ర్డుల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశానన్నారు. అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యత ఇస్తూ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరుగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీలేకుండా పని చేస్తుందన్నా రు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
మున్సిపాలిటీలో ప్రజలకు కావాల్సిన పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో ఎప్పుడూ జరుగని అభివృద్ధి బీఆర్ఎస్(టీఆర్ఎస్)హయాంలో జరుగుతుందని చెప్పారు. తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్‌లో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ఇటీవల రూ. 30కోట్లతో మిషన్ భగీరథ పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. తెల్లాపూర్ ము న్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. అనంతరం చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి మాట్లాడుతూ తెల్లాపూర్ మున్సిపాలిటీలో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని వార్డులకు సమాన ప్రాధా న్యత ఇస్తూ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పనులను వేగంగా పూర్తి చేయించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కౌన్సిలర్లు అందరూ సహకరించడంతో మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ రా ములుగౌడ్, కౌన్సిలర్లు రవీందర్‌రెడ్డి, సుచరితకొము రయ్య, మయూరిరాజుగౌడ్, శంశాబాద్రాజు, చిట్టిఉమేశ్వర్, రాంసింగ్, జ్యోతిశ్రీకాంత్రెడ్డి, లచ్చిరాం, ఏ ఎంసీ వైస్‌చైర్మన్ మల్లారెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు శ్రీపాల్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఏఈ సంజ య్, నాయకులు వెంకట్రాంరెడ్డి, నర్సింహ, ఇంద్రారెడ్డి, దయాకర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.