రామచంద్రాపురం, మే 21: ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి డివిజన్లోని వెలిమెలలో గురువారం రూ. 45 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధికి అనుగుణంగా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పా రు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సోమిరెడ్డి, రాములుగౌడ్, దేవేందర్ యాదవ్, రవీందర్‌రెడ్డి, రాజ్‌కుమార్, బాబ్జీ, నర్సింహులు, కొమురయ్య, శ్రీశైలం, ఉమేశ్, రవీందర్‌రెడ్డి, సాయిచరణ్‌గౌడ్, నాగరాజు, దయాకర్‌రెడ్డి, మధు, బల్దియా అధికారులు పాల్గొన్నారు.