Anakapalli | నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ఫేమ్ యాక్టర్ విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ ‘అనకాపల్లి’ (Anakapalli). ఖగేష్ తమ్మినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్టు 7న సినిమా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. ఈ మూవీలో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. త్రినాథరావు నక్కిన ఈ మూవీ కథ, స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నాడు. అనకాపల్లి గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
ఇప్పుడున్న జెన్‌జీ తరానికి ఎమోషన్స్ తెలియడం లేదు. మళ్లీ ఫ్యామిలీ ఎమోషన్స్‌ను అందరికీ తెలియజేయాలని ఈ సినిమాను తీశామన్నాడు త్రినాథరావు నక్కిన. ప్రస్తుత తరాన్ని ఫ్యామిలీ డ్రామాకు కనెక్ట్ చేస్తూ మెసేజ్ ఇవ్వాలనుకున్నా. నేను ఓ డైరెక్టర్‌ను అవడంతో ఈ చిత్రానికి ఎక్కడెక్కడ ఏం అవసరపడిందో అక్కడ బడ్జెట్ పెంచుకుంటూ వెళ్లా. ఓటీటీ డీల్‌కు సంబంధించి అమెజాన్ ప్రైం వాళ్లతో చర్చలు జరుపుతున్నాం.
అనకాపల్లి సినిమాను మొత్తం అనకాపల్లిలోనే చిత్రీకరించాం. లొకేషన్స్ రియల్‌గా ఉండాలని మా సొంతూరులో షూట్ చేశాం. ఓ టౌన్లో జరిగే సాగే లవ్ స్టోరీ.. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. సినిమా కథకు టైటిల్ సరిగ్గా సూట్ అవుతుంది. సొంతూరుపై ఉన్న మమకారంతోనే ఈ టైటిల్ పెట్టానని చెప్పుకొచ్చాడు. ప్రతీ డైరెక్టర్‌లోనూ ఒక యాక్టర్ ఉంటాడు. నాకు పొట్ట ఉన్నా ఇంకా పొట్ట కావాలని మా డైరక్టర్ అనేవాడు. అందుకే ప్రతీ రోజు సెట్స్‌కు వెళ్లేటప్పుడు ఫుల్లుగా బిర్యానీ తినేవాడినన్నాడు.
ఈ మూవీలో పుష్ప 2 విలన్ తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తుండగా.. త్రినాథరావు నక్కిన, ఇంద్రజ కనిపించబోతున్నారు. శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందినీ రాయ్, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని నక్కిన నరేటివ్స్, భవ్య శ్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై త్రినాథరావు నక్కిన, నాయుడు కాండ్రేగుల సంయుక్తంగా నిర్మిస్తుండగా.. డావ్జాండ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.