జిన్నారం, సెప్టెంబర్ 30: దేశంలోనే మొదటి సారిగా తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ పథకాన్ని, సొంత జాగా ఉన్న వారికి రూ.మూడు లక్షలు అందించేందుకు గృహలక్ష్మి పథకాన్ని అందిస్తూ సీఎం కేసీఆర్ పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. జిన్నారం మండలం మాధారం గ్రామం కొలను అనంతరెడ్డి ఫంక్షన్హాల్లో శనివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి గృహలక్ష్మి ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదలకు రూ.3లక్షల ఆర్థిక సా యం అందించేందుకు సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారని, మొదటి విడతలో నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రొసీడింగ్ పత్రాలు అందజేసినట్లు తెలిపారు. లబ్ధిదారులకు మూడు విడతల్లో డబ్బు అందుతుందన్నారు.
దళారుల ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇందిరమ్మ ఇండ్లలో వేల కోట్ల అవినీతి జరిగిందని, అవినీతికి కేంద్రంగా ఆ పథకం నిలిచిందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికే ఇండ్ల కేటాయింపు చేసి, కోట్ల రూపాయల ప్రజల సంపదను పక్కదారి పట్టించారన్నారు. ఇప్పుడు అ మలుకు చేతగాని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు తెలివైనవారని, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. 65 ఏండ్లలో చేయని అభివృద్ధిని పదేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని పేర్కొన్నా రు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి చిరునామాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని ప్ర జలను కోరారు. అంతకుముందు తెలంగాణ తల్లి చిత్రపటం వద్ద నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి గూడెం యాద మ్మ, ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేశారు.
కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు రవీందర్‌గౌడ్, సుష్మావేణుగోపాల్రెడ్డి, దేవానంద్, ప్రవీణాభాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీలు సుప్రజావెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్, కార్పొరేటర్లు కుమార్‌యాదవ్, పుష్పానగేశ్, సింధూఆదర్శ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు రోజాబాల్రెడ్డి, పాండురంగారెడ్డి, లలితాసోమిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్, ఆత్మకమిటీ చైర్మన్ కుమార్‌గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు చంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, తహసీల్దార్లు రవికుమార్, భాస్కర్, సంగ్రామ్‌రెడ్డి, గౌరివత్సల, గంగాభవాని, ఎంపీడీవోలు రాములు, బన్సీలాల్, మల్లేశం, చంద్రశేఖర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజేశ్, సర్పంచ్‌లు సరితాసురేందర్‌గౌడ్, చెట్టి శివరాజ్, ప్రకాశ్‌చారి, జనార్దన్, సత్యనారాయణ, ఆంజనేయు లు, రేఖాకృష్ణ, ఖదీర్, ప్రశాంతీనరేందర్, లావణ్యాశ్రీనివాస్రెడ్డి, లావణ్యాజీవన్, శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీలు స్వాతీప్రభాకర్రెడ్డి, సంతోషీమహేశ్, లావణ్యానరేశ్, జనాబాయి, ఆకుల భార్గవ్, నాయకులు తులసిరెడ్డి, యూనుస్, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.