చేప పిల్లల పంపిణీతో.. ఉపాధి
పటాన్చెరులో ప్రముఖ గాయకుడు దివంగత గద్దర్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్‌రెడ్డితో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటిసారిగా పటాన్చెరులో గద్దర్ కాంస్య విగ్రహం పెడుతున్నామన్నారు.
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
- పటాన్చెరు డివిజన్లోని సాకి చెరువులో 3 లక్షల చేప పిల్లలు విడుదల
పటాన్చెరు, సెప్టెంబర్ 8: పటాన్చెరులో ప్రముఖ గాయకుడు దివంగత గద్దర్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్‌రెడ్డితో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటిసారిగా పటాన్చెరులో గద్దర్ కాంస్య విగ్రహం పెడుతున్నామన్నారు. బుర్రకథ కళాకారుడిగా ప్రారంభమైన గద్దర్ అంచలంచలుగా ఎదిగారన్నారు. ప్రజాగాయకుడిగా ఆయన సంపాదించిన పేరు ప్రఖ్యాతులు అద్భుతమని కొనియాడారు. విప్లవ రాజకీయాల్లోను తనదైన ప్రత్యేకతను లిఖించిన వ్యక్తి గద్దర్ అన్నారు. కవిగా, ప్రజా గాయకుడిగా, విప్లవ కారుడిగా, సాహిత్యకారుడిగా గద్దర్ అనేక రూపాలు చూపారన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ సేవలు మరువలేనివన్నారు. ప్రజా యుద్ధనౌకగా గుర్తింపు సాధించిన గద్దర్ మనమధ్య లేకపోవడం విచారకరమన్నారు.
సబ్సిడీ గొర్రెల పంపిణీ
సబ్సిడీలతో గొల్ల కురుమల సంక్షేమం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. మండలంలోని ముత్తంగి గ్రామంలో 10 మంది లబ్ధిదారులకు సబ్సిడీ గొర్రెపిల్లల యూనిట్లను ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గొల్ల కురుమల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు తెచ్చారన్నారు. రూ లక్షా 75వేల విలువైన 20 మేకలు, ఒక పొట్టేలు అందజేస్తున్నట్లు తెలిపారు.
మత్స్యకారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి
మత్స్యాకారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. పటాన్చెరు డివిజన్ 113లోని సాకి చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మూడు లక్షల ఉచిత చేపపిల్లలను వదిలారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. మత్స్యకారుల్లో ఆర్థిక స్వావలంబన జరుగాలని సీఎం కేసీఆర్ ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, జడ్పీటీసీ సుప్రజా వెంకట్‌రెడ్డి, ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్నా శ్రీనివాస్, కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, మత్స్యశాఖ జిల్లా అధికారి సతీశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, మాజీ కార్పొరేటర్ అంజయ్యయాదవ్, నాయకులు గడ్డయాదయ్య, గొల్కొండ లక్ష్మణ్, రఘు, సర్పంచ్ ఉపేందర్ ముదిరాజ్, సీనియర్ వెంకట్‌రెడ్డి, మేరాజ్‌ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణముదిరాజ్, గడ్డ యాదయ్య, నగేశ్, నివర్తి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

