సంగారెడ్డి, ఆగస్టు 12: సీఎంఆర్ఎను సద్వినియో గం చేసుకోవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నా రు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నాలుగు మండలాలు, రెండు పట్టణాలు, ఇతర నియోజకవర్గాలకు చెందిన 163 మంది బా ధితులకు రూ.54,61,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీచేశారు.
ముఖ్యమంత్రి సహాయ నిధులను అవసరాలకు వాడుకుని, ఆర్థిక ఇబ్బందులను అధిగమించాలని, ప్రైవేల్ దవాఖానలో చికిత్స లు చేయించుకున్న బాధితులు నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పదేండ్లుగా పార్టీలకతీతంగా ఆపదలో ఉన్న బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులు అందజేస్తున్నారన్నారు.
పట్టణంలో సగం వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని, గతంలో చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేశారన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నరహరిరెడ్డి, సదాశివపేట వైస్‌చైర్మన్ చింతా గోపాల్, శివరాజ్ పాటిల్, మాజీ జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ యాదమ్మ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, నర్సింహులు, మధుసూదన్‌రెడ్డి, చక్రపాణి, ఆంజనేయులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.