నర్సాపూర్/ కౌడిపల్లి, జూలై18: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంట్‌పై చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ పాతాళానికి వెళ్లిందని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం కౌడిపల్లి మండలం తునికి గ్రామ సమీపంలోని రైతువేదికలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. సమావేశంలో మూడు గంటల కరెంట్ కావాలా…3 పంటల ప్రభుత్వం కావాలా అనే దానిపై తీర్మానం చేశారు. రైతులందరూ మూడు పంటల ప్రభుత్వమే(బీఆర్ఎస్) కావాలని హర్షద్వానాలతో తీర్మానం చేశారు. సమావేశానికి వర్షాన్ని కూడా లెక్కచేయకుండా రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో చీకటి రోజులు వస్తాయని, కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకుంటారని కాంగ్రెస్ నాయకులు హేళనచేశారని గుర్తుచేశారు. కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తూ దేశంలోని మిగతా రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిపాడని తెలిపారు.
పీసీసీ అధ్యక్షుడు ఇప్పుడే ముఖ్యమంత్రి అయినట్లు అమెరికాలో పగటి కలలు కంటూ మూడు గంటల విద్యుత్ సరిపోతుందని ప్రేలాపనలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో నాణ్యమైన విద్యుత్ లేక తరచూ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవని, కాలిపోయిన వాటిని రైతులు ట్రాక్టర్లలో, ఎడ్ల బండ్లల్లో పట్టణాలకు మరమ్మతుల కోసం తీసుకొచ్చి నానాఅవస్థలు పడేవారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాళ్ల నైజం మారదని మళ్లీ గొంగడి, కట్టే చేతపట్టి రాత్రి వేళళ్లో పొలాలకు రైతులు పయనమవ్వాలన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగా అంటే రేవంత్‌రెడ్డి మూడు గంటలే చాలంటున్నాడని, ఇద్దరు దొందుదొందేనని చురకలంటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కాంగ్రెస్‌కు ఓటేస్తే భారీమూల్యం చెల్లించుకోక తప్పదని సూచించారు. దేశంలోని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు తెలంగాణలో పర్యటించి 24 గంటల ఉచిత విద్యుత్‌ను చూసి ఆశ్చర్యచకితులు అవుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో పర్యటిస్తే కరెంట్ దొంగలు వస్తున్నారని రైతులు అంటున్నారని తెలిపారు.
రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తలేమని కాంగ్రెస్ నాయకులు పేలుతున్నారని, విద్యుత్ లేక పొలం ఎండిపోయిందనే ఫిర్యాదులు ఇప్పటివరకు రాలేవని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో రైతులు కంటినిండా నిద్రపోతున్నారని, అదే మీ హయాంలో అలా ఉండేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కేసీఆర్ కుటుంబసభ్యులను తిట్టడమే తప్ప అభివృద్ధి పనులు చేసే సోయిలేదన్నారు. రైతులంతా ఐకమత్యంతో ఉండి కాంగ్రెస్, బీజేపీ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజల దీవెనలు ఉండాలని మళ్లీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజునాయక్, జడ్పీటీసీ కవితాఅమర్సింగ్, రైతు సమన్వయ మండల కన్వీనర్ సార రామాగౌడ్, స్థానిక సర్పంచ్‌లు లక్యానాయక్, తునికి నల్లపోచమ్మ ఆలయకమిటీ చైర్మన్ గోపాల్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు తలారి సాయిలు, మైపాల్‌రెడ్డి, పద్మాకిష్టయ్య, నర్సింగ్‌రావు, శ్యామ్‌సుందర్‌రావు, సత్తయ్య, శేకులు, గణేశ్, రైతులు పాల్గొన్నారు.