Zaheerabad | జహీరాబాద్, ఫిబ్రవరి 6 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13, 14, 17, 18, 22, 34 వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు స్థానికులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు బీఆర్ఎస్ పాలనలో జహీరాబాద్ మున్సిపల్ లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తమను ఆశీర్వదించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని, అందరికీ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు.

Zaheerabad1