Allu Sirish | ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, యువ హీరో అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. నయనికతో ఆయన వివాహం మార్చి నెలలో జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందే తన స్నేహితులకు దుబాయ్‌లో గ్రాండ్ బ్యాచిలర్ పార్టీ ఇచ్చి సందడి చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనవరి 30, 31 తేదీల్లో జరిగిన ఈ పార్టీకి అల్లు కుటుంబ సన్నిహితులు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సహా శిరీష్ స్నేహితులు హాజరయ్యారు. తాజాగా అల్లు శిరీష్ తన సోషల్ మీడియా ఖాతాలో పార్టీ వీడియోను షేర్ చేయగా అది అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. వీ
డియోలో కాబోయే భార్య నయనికకు శిరీష్ ప్రేమగా ముద్దు పెట్టుకోవడం హైలైట్‌గా నిలిచింది. అలాగే స్నేహితులందరూ షిప్‌పై చిల్ అవుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసిన దృశ్యాలు కనిపించాయి. దుబాయ్ తీరంలోని ఓ లగ్జరీ యాట్‌లో ఈ బ్యాచిలర్ పార్టీ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్‌గా మారగా, నయనిక మోడ్రన్ దుస్తుల్లో తళుక్కుమంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. వీడియో బయటకు రాగానే నెటిజన్లు, అభిమానులు కాబోయే దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.కొన్ని నెలలుగా అల్లు శిరీష్ వివాహంపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే శిరీష్ స్వయంగా నయనికతో తన నిశ్చితార్థం జరిగిందని ప్రకటించి క్లారిటీ ఇచ్చారు.
నయనిక పెద్ద వ్యాపార కుటుంబానికి చెందినదని, హైదరాబాద్–బెంగళూరు నగరాల్లో వారి కుటుంబానికి భారీ వ్యాపారాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.ఏది ఏమైన ప్రీ వెడ్డింగ్ పార్టీలో శిరీష్ చేసిన హంగామా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక బన్నీ కూడా ఈ పార్టీలో తెగ సందడి చేశారు. ఆ ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి. ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే అల్లు శిరీష్ 2013లో “గౌరవం” సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అనంతరం కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఏబీసీడీ, ఒక్క క్షణం, ఊర్వశివో రాక్షసివో వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది “బడ్డీ” సినిమాలో కనిపించిన ఆయన, కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు పెళ్లి వేడుకలతో వార్తల్లో నిలుస్తుండగా, టాలీవుడ్ మరో గ్రాండ్ మ్యారేజ్‌కు సిద్ధమవుతోంది.