Adilabad | రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యకాండ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్తే సమస్యలపై నిలదీశాడని కక్షతో రాత్రి ఇంటికెళ్లి ఓ ఓటర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుడు దాడికి దిగాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ దౌర్జన్యం జరిగింది.
వివరాల్లోకి వెళ్లే.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 44వ వార్డు నెహ్రూనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. ఓటు వేయమని అడిగిన నాయకులను స్థానికుడు నిలదీశాడు. ఎన్నికలు ఉన్నప్పుడే వస్తారా అని ప్రశ్నించాడు. నాలాలు తీయడం లేదని, ఇతర సమస్యలు ఉన్నాయని వాటిని ముందు పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత ఆ ఓటర్ ఇంటికి కాంగ్రెస్ నాయకుడి అనుచరుడు వచ్చాడు. మమ్మల్నే నిలదీస్తావా అని అతనిపై తీవ్రంగా దాడి చేశాడు. దీనిపై బాధితుడు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. కాంగ్రెస్ అభ్యర్థి, అతని అనుచరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.