బీఆర్ఎస్కు గ్రామాల్లో అప్వూర స్పందన
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆరు అబద్ధాలేనని, కాంగ్రెస్ నాయకులు ఎన్ని గ్యారెంటీలు ప్రకటించినా తెలంగాణలో వారికి వారంటీ లేదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. సోమవారం రాయికోడ్ మండల కేంద్రంతోపాటు ధర్మాపూర్, కుస్నూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
- సీఎం కేసీఆర్‌కు మద్దతుగా భారీగా చేరికలు
- వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరిక
- గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
- ఎమ్మెల్యేను కలిసి మద్దతు ప్రకటించిన వివిధ సంఘాల నాయకులు
- బీఆర్ఎస్లో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం
రాయికోడ్, అక్టోబర్ 24: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆరు అబద్ధాలేనని, కాంగ్రెస్ నాయకులు ఎన్ని గ్యారెంటీలు ప్రకటించినా తెలంగాణలో వారికి వారంటీ లేదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. సోమవారం రాయికోడ్ మండల కేంద్రంతోపాటు ధర్మాపూర్, కుస్నూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ తెలంగాణలో అన్ని వర్గాలకూ సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. దానిని గుర్తించిన ఇతర పార్టీల నాయకులు పెద్దఎత్తున కారెక్కుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గెలిచేది బీఆర్ఎస్ అని సీఎం అయ్యేది కేసీఆర్ అన్నారు. అందోల్‌లో గెలుపు కోసం పార్టీ శ్రేణులు సైనికుల్లా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మల్లికార్జున్‌పాటిల్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సిద్ధన్నపాటిల్, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయలక్ష్మి, ఆత్మకమిటీ చైర్మన్ విఠల్, బీఆర్ఎస్ అధ్యక్షుడు, కార్యదర్శి బస్వరాజుపాటిల్, శంకర్, వరము వైస్ చైర్మన్ తుకారం కురుమ, ఆత్మకమిటీ చైర్మన్ విఠల్, ఎంపీటీసీలు శివకుమార్పాటిల్, నిరంజన్, ఎంపీపీ కో-ఆప్షన్ మెంబర్ అబెదాలి, వీరభద్రేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్‌పాటిల్, పీఎసీఎస్ డైరైక్టర్ బస్వరాజు, నాయకులు ప్రశాంత్‌పాటిల్ ఉన్నారు.
బీఆర్ఎస్ గెలుపు ఖాయం..
వట్పల్లి, అక్టోబర్ 24: తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌కు మద్దతుగా భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే స్వగ్రామం పోతులబోగుడలో ఎమ్మెల్యే సమక్షంలో అందోల్ మండల కాంగ్రెస్ నాయకులు, అల్లాదుర్గం మండలంలోని రెడ్డిపల్లి, టేక్మాల్ మండలంలోని కాదులుర్, వట్పల్లి మండలంలోని దుద్యాల, భుత్కుర్, రాయికోడ్ మండలంలోని ఇసుపూర్ కాంగ్రెస్ నాయకులు సుమారు 263 మంది పార్టీలో చేరారు. పార్టీ లో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో ముడోసారి గులాబీ జెండా ఎగడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మండలాల బీఆర్ఎస్ మండలాధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

