Medak Municipality | మెదక్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల ఓటరు లిస్టు డ్రాప్టు చేసి పొందుపర్చిన జాబితాలో తీవ్ర తప్పిదాలు ఉన్నాయని వాటిని సవరించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్‌తోపాటు మాజీ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. శనివారం మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో మెదక్ మున్సిపల్ కార్యాలయం ప్రచురించిన ఓటరు ముసాయిదా జాబితాలో పూర్తిగా తప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వార్డుకు సంబంధించిన ఓటర్లు మరో వార్డులో రావడం జరిగింది. గతంలో డ్రాఫ్టు చేసిన విధంగా చేయడం లేదు. కార్యాలయ సిబ్బంది అధికారులు ఫీల్డ్‌లోకి వెళ్లి 2020 ఏవిధంగా ఉందో డోర్ టు డోర్ క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ జరిపి జాబితాను సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ ఓటర్ జాబితాలో తప్పులు సవరించే వరకు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అకిరెడ్డి కృష్ణరెడ్డి , మామిళ్ళ ఆంజనేయులు, గడ్డమీది కృష్ణ గౌడ్ , సులోచన ప్రభు రెడ్డి, ఆర్కే శ్రీనివాస్, మాయ మల్లేశం , శ్రీనివాస్, ఏనుగుల రాజు, న్యాయవాది జీవన్ రావు, నాయకులు మెడిశెట్టి శంకర్, గోపాల్, రుక్మ చారి , లక్ష్మణ్, మోహన్ తదితరులు ఉన్నారు.

Jogu Ramanna | రైతు సమస్యలపై మాజీ మంత్రి ఆధ్వర్యంలో ఆందోళన
Khammam Rural : 32 వార్డులు 45 వేల మంది ఓటర్లు.. ఈఎంసి ఓటరు డ్రాఫ్ట్ జాబితా విడుదల
Bonakal : అంగన్వాడీ పిల్లలకు యూనిఫాం పంపిణీ