గుంట,జూన్22: కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. పది రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడతున్నారు. గ్రామాలు, గిరిజనతండాల్లో బోరు బావుల నీరే ప్రజలకు దిక్కవుతున్నది. కష్టాలు మొదలవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటింటికీ సరిపడా మిషన్ భగీరథ నీరు సరఫరా చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రామాల్లో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని కర్నాల్‌పల్లి,రాంపూర్,సోమ్లా తండాల్లో పది రోజులుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదు. రెండు మూడు బిందెల కంటే ఎక్కువ రాకపోవడంతో గిరిజనులు వ్యవసాయ బోరు, బావుల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు.అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, లేకుంటే నీటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుందని పలువురు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
చిలిపిచెడ్, జూన్ 22: వానకాలం మొదల్లో మురిపించిన వానలు తర్వాత ముఖం చాటేశాయి. నెల రోజుల నుంచి వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి.వర్షాలు లేక సాగుపై ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తుండగా రైతులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో పత్తి చేలో మొలకలను కాపాడుకునేందుకు రైతులు బిందెలు,బకెట్లతో నీరుతెచ్చి పోస్తున్నారు.వర్షాలు పడేకపోతే వేసిన పత్తివిత్తనాలు నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. పది రోజులుగా రెండు మూడు బిందెల కంటే ఎక్కువ మిషన్ భగీరథ నీరు రావడం లేదు. వ్యవసాయ బోరు,బావుల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. సమస్య పరిష్కరించకుంటే రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుంది.
– లంబాడీలచ్చియ, సోమ్లాతండా, చేగుంట మండలం, మెదక్ జిల్లా