Mission Bhageeratha officers | వెల్దుర్తి, జూన్ 03 : వెల్దుర్తి మండలంలోని హస్తాల్పూర్ గ్రామంలో సోమవారం తాగునీటి కోసం జెండా ఆవిష్కరణను అడ్డుకొని, పంచాయతీ కార్యాలయం ముందు గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ నిరసనపై స్పందించిన మిషన్ భగీరథ అధికారులు మంగళవారం హస్తాల్పూర్ గ్రామాన్నిసందర్శించారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ డీఈ ప్రవీణ్‌లు పలువురు అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించారు.
గ్రామస్తులతో మాట్లాడి తాగు నీటి సమస్యను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా ఎక్కడి నుండి జరుగుతుంది, నీటి సరఫరా బంద్ కావడానికి కారణాలు ఏంటని, వాటి పరిస్థితిని పంచాయతీ కార్యదర్శితోపాటు గ్రామస్తులతో చర్చించారు. అనంతరం గంగిరెద్దుల వాడకు నీటి సరఫరాను పునరుద్దరించడంతోపాటు ఎస్సీ కాలనీకి బుధవారంలోగా నీటిని అందించి, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని గ్రామస్తులకు తెలిపారు.
Crocodile | గద్వాలలో అర్ధరాత్రి కలకలం.. ఇండ్ల మధ్యకు వచ్చిన మొసలి
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు
Mongolia | విశ్వాసం కోల్పోయి.. మంగోలియా ప్రధాని రాజీనామా