జహీరాబాద్, అక్టోబర్ 26 : బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ అన్ని వసతులతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రారంభించిన మైనార్టీ గురుకులాలు పేద విద్యార్థుల జీవితాలను మార్చేందుకు ఎంతగానో దోహదపడ్డాయి. ఇదే విషయాన్ని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ఎంబీబీఎస్ సీట్లు సాధించిన మైనార్టీ గురుకులాల విద్యార్థులు, తల్లిదండ్రులు అన్నారు. ఆల్గోల్, బూచినెల్లి మైనార్టీ గురుకులాల్లో చదివి మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులను ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సన్మానించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని ఆల్గోల్, బూచినెల్లి మైనార్టీ గురుకులాల్లో చదివిన 16 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించినందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హారీశ్‌రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు శాలువాలతో సత్కారించి, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, రైల్వే బోర్డు మాజీ సభ్యుడు షేక్‌ఫరీద్, బీఆర్ఎస్ నాయకులు బండిమోహన్, యాకూబ్, మోహిజోద్దీన్, రవికిరణ్, ముర్తుజా, విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంబీబీఎస్ సీటు సాధి ంచిన విద్యార్థి ఒబేద్ తండ్రి ఇబ్రహీం మాట్లాడుతూ.. తన కుమారుడు ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అల్గోల్ మై నార్టీ గురుకుల పాఠశాలలో చదువుకున్న ట్లు గుర్తుచేశాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిపారు. తన కుమారుడికి పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయిలో మైనార్టీ గురుకులంలో విద్య లభి ంచిందన్నారు. కేసీఆర్ పాలనలో ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకుల కళాశాలలు నిరుపేద కుటుంబాల రాతను మార్చినట్లు సం తోషంగా చెప్పారు. తన కుమారుడు డాక్టర్‌గా చదివేందుకు తోడ్పాటు అందించిన కేసీఆర్, గురుకుల అధ్యాపకులకు రుణపడి ఉంటానని ఇబ్రహీం పేర్కొన్నారు.
ఎంబీబీఎస్ సీటు సాధించిన వ్యవసా య కుటుంబానికి చెందిన విద్యార్థి ఫిర్దోస్ మాట్లాడుతూ.. తాము ఇదుగురం అక్క చెల్లెళ్లం, తన తండ్రి వ్యవసాయం చేస్తాడని తెలిపారు. ప్రైవేట్‌లో చదివించేందుకు స్థోమత తన కుటుంబానికి లేదన్నారు. తినడానికి తిండికూడా దొరకని పరిస్థితి ఉండేదన్నారు. కేసీఆర్ సార్ ఏర్పాటు చేసిన బుచినెల్లి మైనార్టీ గురుకుల కళాశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకున్నట్లు గుర్తుచేశారు. కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించినట్లు పేర్కొన్నారు. ఎంబీబీఎస్ చదివేందుకు మైనార్టీ గురుకుల కళాశాల దోహద పడినట్లు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన కేసీఆర్ కు రుణపడి ఉంటానని ఫిర్ధోసి పేర్కొన్నారు.