అధికారుల నిర్లక్ష్యం.. డిగ్రీ విద్యార్థులకు శాపం
అధికారుల నిర్లక్ష్యంతో లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. దీంతో డిగ్రీ చదివే విద్యార్థులు రేకుల షెడ్లలోనే పాఠాలు వినాల్సి వస్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రూ.2.25 కోట్లతో బీఆర్ఎస్ సర్కారు సకల వసతులతో నిర్మించింది.
- పక్కా భవనం పూర్తయినా రేకుల షెడ్లలోనే తరగతుల నిర్వహణ
- భవనంలో సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలం
- మంత్రి పొన్నం స్పందించి కొత్త భవనంలోకి కళాశాలను మార్చాలని వినతి
హుస్నాబాద్, ఫిబ్రవరి 1: అధికారుల నిర్లక్ష్యంతో లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. దీంతో డిగ్రీ చదివే విద్యార్థులు రేకుల షెడ్లలోనే పాఠాలు వినాల్సి వస్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రూ.2.25 కోట్లతో బీఆర్ఎస్ సర్కారు సకల వసతులతో నిర్మించింది. కరీంనగర్ రోడ్డులోని మోడల్ స్కూల్ పక్కన పూర్తయిన భవనాన్ని మేలో అప్పటి ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కళాశాలను అందులోకి మార్చాలని స్థానిక విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కోరుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. హుస్నాబాద్కు డిగ్రీ కళాశాల మంజూరైనప్పటి నుంచి గతంలో జూనియర్ కళాశాల నడిచిన రేకుల షెడ్లలోనే డిగ్రీ తరగతులు నడుస్తున్నాయి. వర్షం పడితే గదుల్లోకి నీళ్లు రావడం, ఎండకాలం ఉక్కపోతతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలలో ప్రస్తుతం 375మంది విద్యార్థులు ఉన్నారు.
వీరందరూ అసౌకర్యాల మధ్య చదువు కొనసాగిస్తున్నారు. కొత్తగా నిర్మించిన భవనంలో విద్యుత్తు, నీటి సౌకర్యం లేకపోవడంతో అందులోకి వెళ్లడం లేదని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు చెబుతున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కొత్తగా నిర్మించిన భవనంలోకి మార్చాలని, లేకుంటే వచ్చే విద్యాసంవత్సరం అడ్మిషన్లు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదముం దని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పం దించి సంబంధిత అధికారులతో మాట్లాడి కొత్త భవనంలో సరిపడా సౌకర్యాలను కల్పించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అక్కడే తరగతులు నడిచేలా చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

