హుస్నాబాద్, సెప్టెంబర్ 1: భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. మార్కెట్‌యార్డు, నాగారం రోడ్లలో వర్షపు నీరు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి చేరడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇండ్లలోకి చేరిన నీటిని వెంటనే తొలిగించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
హైవే పనులు పూర్తయితే పట్టణంలో వరద ప్రభావం ఉండదని, త్వరలోనే హైవే పనులు పూర్తి చేసేలా అధికారులతో మాట్లాడామన్నారు. కోహెడ మండలం రామచంద్రాపూర్‌కు చెందిన చెందిన కనుకారెడ్డి ఆవుల కోసం వెళ్లి కెనాల్లో పడి మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా, మండల అధికారు లు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచి ంచారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలోని పరిస్థితులపై సమీక్షించాలని ఒక ప్రకటనలో ఆదేశించారు. ఇబ్బందుల ఎదురైతే సిద్దిపేట కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్‌లోని 08457230 000టోల్ ఫ్రీ నంబరుకు సంప్రదించాలని మంత్రి సూచించారు.