అక్కన్నపేట, జనవరి 3: ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ, ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం అక్కన్నపేటలోని ఎల్లమ్మ దేవాలయ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి వ్యవసాయానికి సాగు నీటిని అందిస్తామన్నారు.
రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి మరింత గౌరవాన్ని కల్పిస్తానన్నారు. విద్య, వైద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు చెప్పారు. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామన్నారు. అనంతరం సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించారు. గండిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంబానాయక్తండాకు చెందిన గుగులోతు తిరుపతినాయక్ కుటుంబానికి రూ. 5లక్షల ప్రమాదబీమా చెక్కును మంత్రి అందజేశారు.