పటాన్చెరు, నవంబర 16: పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం జరిగిన బీఆర్ఎస్ ప్రచా ర సభకు మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇస్నాపూర్ మాజీసర్పంచ్ ఎల్లకొండ మల్లారెడ్డి, చిట్కుల్ మాజీ సర్పంచ్ చిన్న రాములుయాదవ్, వార్డుసభ్యులు జనార్దన్‌రెడ్డి, నారాయణదాస్, ఉర్ల గోపాల్, జాన్వేస్లి, సంపత్‌కుమార్‌రెడ్డి, నర్సింగ్‌యాదవ్, అహ్మద్, నర్సింగ్, రాహుల్‌రెడ్డి,బొల్లారం ఆనంద్ కృష్ణారెడ్డి, వాసుదేవరెడ్డి బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రా వు మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న ప్రాంతం తెలంగాణ అన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో ఉంచిన ఘనత బీఆర్ఎస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కరువుతాండవిస్తుందన్నారు. కాంగ్రెస్ అంటే నాటకం, కేసీఆర్ అంటే నమ్మకం అని గుర్తించాలన్నారు. స్థానిక పరిశ్రమలు కరెంటు లేక ఒకప్పుడు వారంలో మూడు రోజులు బంద్ ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు 24గంటలు కరెంట్ ఇస్తున్నామన్నారు. దేబీజేపీ, కాంగ్రెస్ నాయకుల అబద్ధాలు నమ్మవద్దని సూచించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రజల మనిషి అన్నారు. పనిచేసే ఎమ్మెల్యేకు తప్పక ఓటేసి గెలిపించాలన్నారు.
కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తొమ్మిదిన్నర ఏండ్లు మీ సేవలో ఉన్నానని చెప్పారు కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ శాసనమండలి చైర్మన్ భూపాల్‌రెడి,్డ సఫానదేవ్, శంకర్‌యాదవ్, కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, ఉపేందర్,క్రిష్ణయాదవ్, సుదీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్, నవంబర్ 16: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు గాలి అనిల్‌కుమార్‌ను గురువారం అమీన్‌పూర్‌లోని ఆయ న స్వగృహంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో గాలి అనిల్‌కుమార్ పాత్ర అత్యంత కీలకమని వారు తెలిపారు. అనిల్‌కుమార్ రాకతో బీఆర్ఎస్కు మరింత బలం చేకూరిందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.