సంగారెడ్డి అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలుపు ఖాయమైందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలు, నాయకులు వందల సంఖ్యలో కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరుతుండడం బీఆర్ఎస్ గెలుపునకు నిదర్శనమన్నారు.
బుధవారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో కాంగ్రెస్ నేతలు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. సదాశివపేటలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ నేత, మనబిన్ ఫౌండేషన్ అధ్యక్షుడు ముఖీమ్ వందలమంది మద్దతుదారులతో బీఆర్ఎస్లో చేరారు. సంగారెడ్డిలోని నాల్సాబ్గడ్డలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ మైనార్టీ నేతలు జమాల్, మసూద్, జహంగీర్ బేగ్, ఇంతియాజ్, అజార్ బేగ్, ఇబ్రహంలతోపాటు వందమంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. లారీ అసోసియేషన్ నాయకుడు అబూబాకర్ తన మద్దతుదారులతో బీఆర్ఎస్లో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ పట్టణ అధ్యక్షుడు సరబ్జిత్ సింగ్, కార్యకర్తలు దేవేందర్ సింగ్, రతన్ సింగ్, మంజీత్ సింగ్, విక్కీసింగ్తోపాటు 50మంది బీఆర్ఎస్లో చేరారు. కంది మండలం ఎద్దుమైలారంలో బీసీ సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి బీర్ల శివకుమార్ మూడు వందల మంది మద్దతుదారులతో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉందన్నారు. సంగారెడ్డి ప్రజలు, పార్టీ నేతల ఉత్సాహం చూస్తుంటే చింతా ప్రభాకర్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొందటం ఖాయమన్నారు. సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జగ్గారెడ్డి నియోజకవర్గంలో ఉండకుండా హైదరాబాద్‌కు పరిమితమయ్యారన్నారు. స్వల్ప ఓట్లతో ఓడిపోయిన చింతా ప్రభాకర్ మాత్రం జనం మధ్య ఉన్నట్లు చెప్పారు.నాలుగేండ్లలో చింతా ప్రభాకర్ ప్రజల కోసం పనిచేశారని చెప్పారు. కరోనా వస్తే జగ్గారెడ్డి జాడలేకుండా పోయారన్నారు. చింతా ప్రభాకర్ మాత్రం కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచారన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం పట్టుబట్టి నిధులు సాధించుకు వచ్చినట్లు తెలిపారు. ప్రజల వెన్నంటి ఉన్న చింతా ప్రభాకర్‌ను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ వల్లే సంగారెడ్డికి మెడికల్ కాలేజీ, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు వచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు వల్లే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు.
ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు మరింత అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ చింతా ప్రభాకర్ తనకు మంచి మిత్రుడని, ప్రజల కోసం పనిచేసే చింతా ప్రభాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేత మామిళ్ల రాజేందర్, డీసీసీబీ వైస్ చైర్మన పట్నం మాణిక్యం మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకర్గ ప్రజల కోసం నిరంతరం పనిచేసే చింతా ప్రభాకర్‌ను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, భూపాల్‌రెడ్డి, బీజేపీ నేతలు మామిళ్ల రాజేందర్, జైపాల్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎంఏ హకీం, మామిళ్ల రాజేందర్, వెంకటేశ్వర్లు, నర్సింహులు, విజయేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.