బీజేపోళ్లు.. నయా పైసా పనిచేయలే..
అబద్ధాలు, మాయమాటలు చెప్పి గెలిచిన ఎమ్మెల్యే రఘునందన్‌రావు పైసా పని చేయలేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ చెప్పే 3 గంటల కరెంటుతో ఎవుసం నడవదని, మాయమాటలకు మోసపోయి ఓటు వేస్తే గోస పడే అవకాశం ఉన్నదన్నారు.
- ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే చేగుంటకు డిగ్రీ కళాశాల,స్టేడియం, రైల్వేబ్రిడ్జి తెస్తాం..
- ప్రభాకరన్నను గెలిపించుకుంటేనే చేగుంట అభివృద్ధి
- గృహలక్ష్మి పథకంలో అందరికీ ఇండ్లు మంజూరు చేస్తాం
- పైసలకు ఆశపడి ఓటు అమ్ముకుంటే నష్టపోతాం..
- కేసీఆర్ చేతిలోనే రాష్ట్రం సురక్షితం
- కోటి కుటుంబాలకు రూ.5 లక్షల ఉచిత కేసీఆర్ బీమా
- చేగుంట రోడ్‌షోలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు
- భారీగా హాజరైన జనం.. గులాబీమయంగా మారిన చేగుంట
- మాయమాటలకు మోసపోయి గోసపడొద్దు
చేగుంట, నవంబర్ 28: అబద్ధాలు, మాయమాటలు చెప్పి గెలిచిన ఎమ్మెల్యే రఘునందన్‌రావు పైసా పని చేయలేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ చెప్పే 3 గంటల కరెంటుతో ఎవుసం నడవదని, మాయమాటలకు మోసపోయి ఓటు వేస్తే గోస పడే అవకాశం ఉన్నదన్నారు. ప్రభాకరన్నను గెలిపించుకుంటేనే చేగుంట అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు. చేగుంట మండలం వడియారం గ్రామం నుంచి చేగుంట గాంధీ చౌరస్తా వరకు దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి రోడ్డుషోలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభాకర్‌రెడ్డిని దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిపిస్తే చేగుంటకు డిగ్రీ కళాశాల, స్టేడియం రైల్వే బ్రిడ్జి ఏర్పాటు చేస్తామన్నారు. డబ్బులకు ఆశపడి ఓటును అమ్ముకుంటే అభివృద్ధికి దూరమయ్యే అవకాశం ఉన్నదన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు గృహలక్ష్మి పథకంలో ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. చేగుంట మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామన్నారు. కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని, తన దృష్టికి వచ్చిందని, ఎన్నికల కోడ్ పోగానే మిగిలిన రైతులకు మాఫి జరుగుతుందన్నారు.
3 గంటల కరెంటుతో ఎవుసం సాగుతుందా?
కాంగ్రెస్ చెప్పే 3 గంటల కరెంటుతో ఎవుసం సాగుతుందా అని మంత్రి ప్రశించారు. మాయమాటలు చెప్పే పార్టీలను నమ్ముకుంటే మోసపోయి గోస పడాల్సి వస్తుందన్నారు. ప్రభాకర్‌రెడ్డిపై కత్తి పోటు జరిగిందని, దేవుడి దయతో బతికి మీ ముందుకొచ్చిండని అన్నారు. కష్టంలో ఉన్నా దయగుణం గల మంచి ప్రభాకరన్న కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని మంత్రి తెలిపారు. గృహలక్ష్మి పథకంలో ఇల్లులేని వారికి డబ్బులు కూడా ఇప్పిస్తామన్నారు. చేగుంటలో రైల్వే బ్రిడ్జి కట్టుకోవాలని, డిగ్రీ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, స్టేడియం, గ్రామగ్రామాన మహిళా భవనాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాంగ్రెసోళ్లు బీడికట్టలపై పుర్రె గుర్తు తెస్తే, బీజేపోళ్లు జీఎస్టీతో పాటు గ్యాస్ ధర విపరితంగా పెంచారన్నారు. వృద్ధులు, దివ్యాంగులు,ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పెన్షన్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. సౌభాగ్యలక్ష్మీ పథకంతో నిరుద్యోగ మహిళలకు రూ.3000తోపాటు, రేషన్ కార్డుతో సన్న బియ్యం అందజేస్తారన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పించన్లు, ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు, ప్రాజెక్టులతో సాగునీరుతోపాటు బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టులోని పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు.

చేగుంటను అభివృద్ధి చేస్తా.. ఆశీర్వదించాలి
– బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి
మీ అందరి దీవెనలతో మళ్లీ మీ ముందుకొచ్చా. మంత్రి హరీశ్‌రావు, సీఎం కేసీఆర్ సహకారంతో దుబ్బాకను అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చేగుంట మండలం వడియారం నుంచి చేగుంట వరకు బీఆర్ఎస్ రోడ్‌షో నిర్వహించారు. చేగుంట హెలిప్యాడ్ వద్ద మంత్రి హరీశ్‌రావు, ప్రభాకర్‌రెడ్డికి ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ వంటరి కొండల్‌రెడ్డి, వేంకటేశ్వర స్వామి దేవాలయ ఆలయ ధర్మకర్త కిషన్‌రావు దేశ్‌ముఖ్ ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని చేగుంటలోని యూత్ సభ్యులు గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా దుబ్బాక నియోజకవర్గంలో ప్రజలకు అనేక సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతు బంధును నిలిపేసారన్నారు. రెడ్డిపల్లి, వడియారం, చేగుంటను అన్నిరకాల అభివృద్ధి చేస్తాన్నారు. మూడోసారి సీఎంగా కేసీఆర్‌ను గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనక్ ప్రవీణ్‌కుమార్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, వడ్డెపల్లి తిరుమల నర్సింహులు, బక్కి లక్ష్మీరమేశ్, అయిత వెంకటలక్ష్మి రఘురాములు, జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, నాయిని రాజ్‌గోపాల్, సుభాష్‌రెడ్డి, క్రాంతి, సాబీర్ఆలీ, కిషన్‌రావు, ఎర్ర యాదగిరి, బుడ్డ భాగ్యరాజ్, కారింగుల సిద్దిరెడ్డి, కొటారి అశోక్, సత్యనారాయణ లక్ష్మణ్, రామారావు, నర్సింహులు, రవి ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

