జగదేవ్‌పూర్, నవంబర్ 17 : దక్షిణ భారతదేశం నుంచి కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేసే అదృ ష్టం గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకే దక్కాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడివద్ద ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మండల సమన్వయకర్త రాధాకృష్ణశర్మ, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్‌తో కలిసి రోడ్డు షో నిర్వహించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాకముందు గజ్వేల్ ఎట్లుండే.. కేసీఆర్ సీఎం అయ్యాక గజ్వేల్ ఏవిధంగా అభివృద్ధి చెందిందో ప్రజలు ఆలోచించాలన్నారు. జగదేవ్‌పూర్, ప్రజ్ఞాపూర్ రోడ్డు గుంతలమయంగా ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్‌లోని అన్ని రోడ్లను డబుల్‌గా మార్చారన్నారు. గజ్వేల్ నుంచి పోటీ చేసే నర్సారెడ్డి, ఈటల రాజేందర్ ఏం అభివృద్ధి చేస్తారో చెప్పాలన్నారు. వందల కోట్లతో గజ్వేల్ అభివృద్ధి జరిగిందన్నారు. దేశ, విదేశాల నుంచి అధికారులు వచ్చి అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారన్నారు. 24 గంటల కరెంట్ కావాలా 3గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలలో ప్రజలు ఆలోచించాలన్నారు.
మూడు, నాలుగు సీట్లు రాని కాంగ్రెస్ డకౌట్ అయ్యే బీజేపీకి ఓటేస్తే ఒరిగేదిమీ లేదన్నారు. వందలాది కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటింకీ నీళ్లు అందించారని గుర్తుచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదన్నారు. జగదేవ్‌పూర్ మండల ప్రజలు ఆగమాగం కావొద్దని, ఆలోచించి ఓటేయాలన్నారు. అంతకుముందు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ జగదేవ్‌పూర్‌కు గజ్వేల్ తరహాలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని కోరారు. బటర్ ఫ్లై లైట్లు ఏర్పాటు చేయాలని కోరగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని పనులు పూర్తి చేస్తానని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ్టఅధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ రంగారెడ్డి, ఎంపీపీ బాలేశంగౌడ్, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రాచర్ల నరేశ్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, కొండపోచమ్మ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి చైర్మన్ సుధాకర్‌రెడ్డి, గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కవిత, మాజీ సర్పంచ్ కరుణాకర్, మండల కోఆప్షన్ సభ్యుడు ఎక్బాల్, గ్రామ పార్టీ అధ్యక్షుడు బుద్ద నాగరాజు, పలువురు మండల నాయకులు, సర్పంచులు యాదవరెడ్డి, చంద్రశేఖర్, సత్యం, భిక్షపతి, లావణ్యామల్లేశం, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.