Veterinary Hospitals | చిలిపిచెడ్, ఆగస్టు 13 : మెదక్ జిల్లాలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసేందుకు స్పెషల్ డ్రైవ్ ద్వారా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. బుధవారం చిలిపిచెడ్ మండలంలోని బండ పోతుగల్ గ్రామంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. మూగజీవాలకు జిల్లాలో రూ.1లక్ష 42 వేల బ్లూటంగ్ వ్యాధి వ్యాక్సిన్, పశువులకు 45,000 ముద్ద చర్మవ్యాధి టీకాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
పశు వైద్యశాలలో అన్ని రకాల మందులు, వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా పశువైద్యులతో కలెక్టర్ మాట్లాడి బ్లూటంగ్ వ్యాధి నివారణకు ఇచ్చే టీకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన రిజిస్టర్లు, నమోదు వివరాలను తనిఖీ చేశారు. అనంతరం మూగజీవాలకు వర్షాకాలంలో వ్యాధులు విస్తరించే ప్రమాదం ఎక్కువగా ఉండడంతో, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
జిల్లావ్యాప్తంగా 1,42,000 పశువులకు సంబంధించి బ్లూటంగ్ వాక్సినేషన్ దాదాపు పూర్తి కావచ్చిందని, ముద్ద చర్మవ్యాధికి సంబంధించి 45,000 టీకాలు అందుబాటులో ఉంచుకొని.. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం 80% పూర్తి చేశామని చెప్పారు.
పశువుల్లో అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యులను సంప్రదించాలని రైతులకు సూచించారు. టీకాల కార్యక్రమాలను సమయానికి పూర్తి చేయాలని, పశు రైతులు తమ పశువులకు విధిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. అనంతరం పాల ఉత్పత్తిని పెంచే మినరల్ మిక్చర్, క్యాల్షియం ప్యాకెట్స్ పశుగ్రాస విత్తనాలను కలెక్టర్ రైతులకు పంపిణీ చేశారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో చెట్లు నాటారు.
బండ పోతుల గ్రామంలో పశువైద్య దవాఖానను నిర్మించాలని గ్రామ పాడి పోషణ రైతులు కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ అధికారి నర్సాపూర్ ఏడీ జనార్ధన్, చిట్కుల్ పశు వైద్యాధికారి వినోద్ కుమార్, ఇతర వైద్యాధికారులు ప్రియాంక, గీతా మాధురి, ఎంపీడీవో ప్రశాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Heavy Rains | అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్సై కీలక ఆదేశాలు
Road Repair | ఆదమరిస్తే అంతే.. సారూ ఈ రోడ్లకు జర మరమ్మతులు చేయించండి
గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలకు అవస్థలు