e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home మెదక్ త్వరలో అందుబాటులోకి మెదక్ కలెక్టరేట్

త్వరలో అందుబాటులోకి మెదక్ కలెక్టరేట్

త్వరలో అందుబాటులోకి మెదక్ కలెక్టరేట్
  • ఎస్పీ కార్యాలయ కాంట్రాక్టర్ తొలగించండి
  • మెదక్ జిల్లాలో 2900 డబుల్ బెడ్ ఇండ్లు సిద్ధం
  • ‘రైతుబంధు’ డబ్బులు రైతులకే ఇవ్వండి
  • వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి
  • సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్


మెదక్, జూన్ 24 : త్వరలోనే మెదక్ కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను అందుబాటులోకి తెస్తామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ అన్నారు. గురువారం మెదక్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల పనుల పురోగతితో పాటు మార్కెటింగ్, వైద్య, ఆరోగ్యం, డబుల్ బెడ్ ఇండ్లు, వ్యవసాయం, మున్సిపాలిటీల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ కొత్త కలెక్టరేట్ సముదాయం పనులు నవంబర్ నాటికి పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆర్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ కార్యాలయ పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయని, కాంట్రాక్టర్ తొలగించి వారం రోజుల్లో షార్ట్ టెండర్లు పిలిచి పూర్తయ్యేలా చూడాలని పోలీసు శాఖ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సూచించారు. మెదక్ వెయ్యి, నర్సాపూర్ 800, తూప్రాన్ 800, రామాయంపేటలో 300 డబుల్ బెడ్ ఇండ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రోజుల్లో ఇండ్లకు విద్యుత్, సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం, తాగునీటి సరఫరా వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. శ్రావణ మాసంలో గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బ్యాంకర్లు రైతుబంధు డబ్బులు పట్టుకుంటే వెంటనే తిరిగి రైతులకు చెల్లించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్, జిల్లా వ్యవసాయశాఖ జిల్లా అధికారిని ఆదేశించారు. జిల్లాలో కరోనా అదుపులోకి వచ్చిందని, ఒక శాతంలోపే కేసులు ఉన్నాయని, అయినా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారికి సూచించారు.

వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను ప్రారంభించండి
మెదక్, రామాయంపేటలో వెజ్ అండ్ నాన్ మార్కెట్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు మంత్రి హరీశ్ సూచించారు. రైతు వేదికల్లో వ్యవసాయ విస్తరణాధికారులు, రైతులతో సమావేశాలు జరిగేలా చూడాలని, చివరి దిశలో ఉన్న 27 రైతు వేదికలను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. వరిలో వెదజల్లే పద్ధతి ప్రోత్సహించాలని, పత్తి, కంది పంట వేసేలా చూడాలని వ్యవసాయాధికారికి సూచించారు. ఆయిల్ తోటల పెంపకానికి జిల్లాలో అనువైన వాతావరణం ఉన్నందున సాగుకు ప్రోత్సహించాలన్నారు. కేజీవీల్స్ రోడ్లు పాడవుతున్నాయని, రోడ్డుపై వచ్చే వాటికి రూ.5వేల జరినామా వేయాలని, వాహనాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. ఈ యాసంగింలో 4.50 లక్షల టన్నుల ధాన్యం సేకరించి రూ.795 కోట్లు రైతులకు అందజేసినందుకు కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులు, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడిని మంత్రి అభినందించారు. ప్రతి రోజూ వెయ్యి కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటు రెండు వేల మందికి టీకాలు ఇస్తున్నామని డీఎంహెచ్ వెంకటేశ్వర్ తెలుపగా, నేటి నుంచి రోజు నాలుగు వేల మందికి టీకాలు ఇవ్వాలని ఆదేశించారు. వారంలోగా డయాలిసిస్ బెడ్లు పెంచాలని మెదక్ జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మంత్రి సూచించారు.

- Advertisement -

పెండింగ్ ఉన్న 38 వైకుంఠధామాలను పది రోజుల్లోగా పూర్తి చేయాలని డీపీవో తరుణ్ డీఆర్ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. మెటీరియల్ కాంపోనెంట్ సంబంధించి అన్ని పనుల వివరాలను అప్ చేయాలన్నారు. పట్టణంలో నిర్మిస్తున్న చౌరస్తా సర్కిళ్లు ప్రమాదకరంగా ఉన్నాయని, రోడ్డు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు కొనసాగించాలన్నారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ కలెక్టర్ హరీశ్, ఎస్పీ చందనదీప్తి, అదనపు కలెక్టర్ రమేశ్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్ డీఎంహెచ్ వెంకటేశ్వర్ జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, మున్సిపల్ కమిషనర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి
మెదక్, జూన్ 24 : క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని పీఎన్ ఇండోర్ స్టేడియంలో మెదక్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సింథటిక్ గ్రీన్ మ్యాట్స్ గురువారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ కలెక్టర్ హరీశ్ కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇండోర్ స్టేడియం అభివృద్ధికి ఎమ్మె ల్యే పద్మాదేవేందర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. మెదక్ మున్సిపాలిటీ నిధుల నుంచి రూ. 4.75 లక్షలు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఈ నిధులతో పీఎన్ ఇండోర్ స్టేడియంలో మూడు కోర్టులకు యోనెక్స్ సింథటిక్ గ్రీన్ మ్యాట్స్, 3 ఉడెన్ కోర్ట్స్ మరమ్మతులు, 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారన్నారు. 50 మంది బ్యాడ్మింటన్ క్రీడాకారులు సేకరించిన రూ.3.40 లక్షలతో జాతీయస్థాయి పోటీలకు సరిపడా లైటింగ్, గ్యాలరీ, శాశ్వత వేదిక, స్టేడియం లోపల రంగులు వేయ డం, 45 అడుగుల ఎత్తుగల నిచ్చెనును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్టేడియం ఆవరణలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలన్నారు. సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని, 8 ఏసీలను ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీ మెదక్ ఆధీనంలో ఉన్న పీఎన్ ఇండోర్ స్టేడియం బాధ్యతను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించాలని మంత్రి హరీశ్ స్టేడియం అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.


షటిల్ ఆడిన మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..
మెదక్ పీఎన్ ఇండోర్ స్టేడియంలో సింథటిక్ గ్రీన్ మ్యాట్స్ ప్రారంభోత్సవం అనంతరం కొద్దిసేపు మం త్రి హరీశ్ షటిల్ ఆడారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ కలెక్టర్ హరీశ్ షటిల్ ఆడారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా పీఎన్ స్టేడియం ఆవరణలో మొక్క లు నాటారు. తర్వాత ఇందిరాగాంధీ స్టేడియాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ అధికారులు, పీఈటీలు, కౌన్సిలర్లు, టీఆర్ నాయకులు పాల్గొన్నారు.


సమీకృత మార్కెట్, వైకుంఠధామాలకు-శంకుస్థాపన చేసిన మంత్రి
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 24 : మెదక్ మున్సిపాలిటీ పరిధిలో రూ.4.50 కోట్లతో నిర్మించే సమీకృత మార్కెట్ భవన సముదాయానికి, రూ.2 కోట్లతో నిర్మించే రెండు వైకుంఠధామాల నిర్మాణాలకు మంత్రి హరీశ్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహ రి, కౌన్సిలర్లు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు చింతల నర్సింహులు, టీఆర్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, కృష్ణాగౌడ్, టీఆర్ నాయకులు పాల్గ్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
త్వరలో అందుబాటులోకి మెదక్ కలెక్టరేట్
త్వరలో అందుబాటులోకి మెదక్ కలెక్టరేట్
త్వరలో అందుబాటులోకి మెదక్ కలెక్టరేట్

ట్రెండింగ్‌

Advertisement