మెదక్, ఫిబ్రవరి(నమస్తే తెలంగాణ): ఈ ఏడాది నుంచి మెదక్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని, తరగతులను ప్రారంభిస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెడికల్ కళాశాల ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? నిధుల విషయం ఏమిటని అడిగారు. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో మెడికల్ కళాశాలల మంజూరుతో పాటు సీట్లను కూడా కేటాయించినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ ఈ విద్యాసంవత్సరం నుంచే మెదక్ వైద్య కళాశాల ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామని, మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం స్థలాన్ని వైద్యారోగ్య శాఖకు ఇవ్వాలని కోరామన్నారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు.