crop insurance | నర్సాపూర్, జులై 3 : రైతులకు పంట బీమాను అమలుపరిచి వారికి భరోసా ఇవ్వాలని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు పత్రాల యాదాగౌడ్, జిల్లా ముఖ్య సలహాదారుడు చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు నర్సాపూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు వారి సంపాదనను మొత్తం పెట్టుబడిగా పెట్టి సాగులో నిమగ్నమయ్యారని గుర్తుచేశారు. పంటల బీమా లేకపోవడం వలన రైతులు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని వెల్లడించారు.
కావున ఈ ఖరీఫ్ నుంచే ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజనను తక్షణమే అమలు చేయాలని అన్నారు. రైతుకు ఒక్కసారి పంట నష్టం వాటిల్లితే తిరిగి స్థిరపడడానికి 3 నుండి 4 పంటల కాల సమయం పడుతుందని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో పంట బీమా ఓ రక్షణ కవచంగా పనిచేస్తుందని గుర్తుచేశారు. ఇది ఒక ఆర్ధిక పథకం కాదని రైతుకు భరోసా ఇచ్చే మానవతా చర్య అని వెల్లడించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్నా ఇది పెద్ద భారం కాదని స్పష్టం చేశారు. రైతులు వారివారి ప్రీమియంను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం కూడా సమాన ప్రీమియాన్ని మిగతా భాగంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భీమా పథకాన్ని అమలు చేయాలని, రైతుల తరుపున గట్టిగా డిమాండ్ చేస్తున్నామని హెచ్చరించారు. వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికి నష్టపరిహారం చెల్లించలేదని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు ఆనంద్ గౌడ్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.
SI Rajeshwar | బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు.. రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ మృతి
Fake medicines | ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ మందుల దందా.. పట్టించుకోని అధికారులు
DEO Radha Kishan | కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో రాధా కిషన్