మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 21 : మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది. ఈ సందర్బంగా సండే స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తిశ్రద్ధలతో ఆలపించిన ఏసయ్య భక్తిగీతాలు ఆలరింపజేశాయి.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రార్థనల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి ఫాస్టర్ రెవరెండ్ దయానంద్ భక్తుల నుద్దేశించి దైవ సందేశం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు చర్చి ఆవరణలోని చెట్ల కింద వంటవార్పు చేసుకున్నారు.
ప్రార్థనల్లో ఫాస్టర్లు రాజశేఖర్, వర్జర్, జైపాల్, డేవిడ్లతో పాటు చర్చి కమిటీ సభ్యులు రోలండ్పాల్, సంశాన్ సందీప్, సునీల్, స్వామిదాస్, జాయ్ముర్రే, సువన్ డగ్లస్, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.