e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home మెదక్ కొనసాగుతున్న లాక్‌డౌన్‌

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

కొనసాగుతున్న లాక్‌డౌన్‌
  • లాక్‌డౌన్‌కు అన్ని వర్గాల నుంచి సహకారం
  • ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కార్యకలాపాలు
  • స్వచ్ఛందగా బంద్‌ పాటించిన వ్యాపారులు
  • జహీరాబాద్‌లో నిర్మానుష్యంగా రోడ్లు
  • రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు

అందోల్‌, మే 13: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ గురువారం సంపూర్ణంగా కొనసాగుతున్నది. అందోల్‌-జోగిపేట మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గం వ్యాప్తంగా లాక్‌డౌన్‌కు ప్రజలు,వ్యాపారుల నుంచి పూర్తి మద్దతు లభించిది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరుకులు, ఇతర సమగ్రి దుకాణాలకు వెసులుబాటు ఇవ్వండతో ఈ సమయంలో ప్రజలు తమకు కావాల్సిన సరుకులు కొనుగోలు చేశారు. అనంతరం రద్దీ ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. గ్రామాల్లో ప్రధాన చౌరస్తాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మహారాష్ట్ర కూలీలను గమ్యానికి తరలించిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌
లాక్‌డౌన్‌ విధించడంతో మహారాష్ట్రకు చెందిన కొం తమంది కూలీలు కాలినడకన పిల్లాపాపలతో, మూటముల్లె నెత్తిన పెట్టుకుని జోగిపేట మీదుగా వారి సొంత గ్రామాలకు వెళ్తున్న విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పంది ంచిన ఎమ్మెల్యే వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పా ట్లు చేసి మంచి మనస్సును చాటుకున్నారు. జోగిపేట సీఐ శ్రీనివాస్‌తో ఫోన్లో మా ట్లాడిన ఎమ్మెల్యే వారు స్వస్థలాలకు వెళ్లేందుకు వాహనాలు, భోజన సదుపాయం కల్పించాలని సూచించారు. దీంతో సీఐ వాహనం సిద్ధం చేయడంతో పాటు భోజనం పెట్టించి పండ్లు ఇతర సామగ్రిని అందజేసి, స్వ గ్రామాలకు పంపారు. ఈ సందర్భంగా కూలీలు ఎమ్మెల్యేకు, స్థానిక పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంపూర్ణ లాక్‌డౌన్‌
రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ విధించడంతో రెండో రోజు కూడా సంపూర్ణంగా కొనసాగింది. గురువారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సంపూర్ణంగా లాక్‌డౌన్‌ పాటించారు. స్థానిక ఎస్‌ఐ ఏడుకొండలు ఆధ్వర్యంలో తన సిబ్బందితో ప్రతి గ్రామంలో లాక్‌డౌన్‌ పరిస్థిలను తెలుసుకున్నారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్‌ఐ ఏడుకొండలు మాట్లాడుతూ మండలంలో పకడ్బందీగా లాక్‌డౌన్‌ నిర్వహిస్తున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.

జహీరాబాద్‌లో జనతా బంద్‌
నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలకు స్వచ్ఛందంగా బయటకు రావడం లేదు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. లాక్‌డౌన్‌తో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడం జరిగిందని, వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు బంద్‌ చేయాలని పోలీసులు అవగాహన కలిపించారు. జహీరాబాద్‌ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్‌, భవానీ మంద్‌ చౌరస్తా, పస్తాపూర్‌ చౌరస్తా, రాంనగర్‌, చౌరస్తాల వద్ద పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతల్లో భారీకేడ్లు ఏర్పాటు చేశారు. కర్ణాటక, మహారాష్ర్టా ప్రజలు తెలంగాణలోకి రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పర్యవేక్షణ చేశారు. జహీరాబాద్‌ డీఎస్పీ జి.శంకర్‌రాజు, పట్టణ, రూరల్‌ సీఐలు రాజశేఖర్‌, నాగేశ్వర్‌రావు లాక్‌డౌన్‌ను పర్యవేక్షణ చేశారు.

లాక్‌డౌన్‌ విజయవంతం
మండల కేంద్రమైన ఝరాసంగంతో పాటు ఆయా గ్రామాల్లో గురువారం పోలీస్‌ సిబ్బంది లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కలిసి గ్రామాల్లో దండోరా వేయించి అవగాహన కల్పించారు. ఉపాధి హామీ, వ్యవసాయ పనులు నిబంధనలు పాటిస్తూ కొనసాగించారు.

కొనసాగుతున్న లాక్‌డౌన్‌
మండల కేంద్రం వట్‌పల్లితో పాటు గ్రామాల్లో గురువారం లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. ప్రజలు ఉదయం 6 నుంచి 10గంటల వరకు తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసి ఇండ్లకు చేరుకున్నారు. 10 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. వట్‌పల్లి ఎస్‌ఐ దశరథ్‌ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో తన సిబ్బందితో గస్తీ నిర్వహించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొనసాగుతున్న లాక్‌డౌన్‌

ట్రెండింగ్‌

Advertisement